వెంకటాచలంలో ఫ్యాన్ గుర్తుకు మద్దతుగా కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై మంది నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్రం, వడ్డిపాలెం ప్రాంతాలలో గడప గడపకూ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థించారు.