భీష్మ పర్వం సినిమాతోనే నాకు మంచి గుర్తింపు లభించింది: సుదేవ్ నాయర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

మలయాళ చిత్ర పరిశ్రమలో భీష్మ పర్వం సినిమా తన కెరీర్కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిందని నటుడు సుదేవ్ నాయర్ పేర్కొన్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజన్ మోన్ పాత్ర తనకు ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ తెచ్చిపెట్టిందని తెలిపారు. అమల్ నీరద్ దర్శకత్వ ప్రతిభ, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ తన పాత్రను ప్రజలకు చేరువ చేశాయని క్లబ్ ఎఫ్ఎం ఇంటర్వ్యూలో సుదేవ్ నాయర్ వెల్లడించారు.