బాక్సాఫీస్ వద్ద తగ్గిన దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' వసూళ్లు

రిపోర్టర్: రాము స్థలం: India

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'ఐయామ్ గేమ్' సినిమా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద క్రమంగా తగ్గుతున్నాయి. ఆరో రోజు మంగళవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.12 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో భారత్‌లో మొత్తం వసూళ్లు రూ. 21.62 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 42.49 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.