మేడిగడ్డ బరాజ్ కూల్చివేత కుట్రపై సిట్ వేయాలని ఆర్ఎస్పీ సంచలన డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ పై కాకుండా మేడిగడ్డ బరాజ్ కూల్చివేత కుట్రపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ కుంగుబాటు సాధారణ ఘటన కాదని, అది ముమ్మాటికీ పేల్చివేత అని ఆయన ఆరోపించారు. ఈ కుతంత్రంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.