గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ.. విస్తరించని విమాన సేవలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కృష్ణా జిల్లా

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 500% పెరిగినా, అందుకు తగ్గట్లుగా విమాన సేవలు లేవు. 14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా, అంతర్జాతీయ సర్వీసులు పరిమితంగానే ఉన్నాయి. 80% ఆక్యుపెన్సీ ఉన్నా కొత్త రూట్లు ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్, శ్రీలంక వంటి ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని, రోజువారీ విమానాలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.