అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు ఐదు చోట్ల చోరీలు

రిపోర్టర్: రాము స్థలం: అనంతపురం

అనంతపురం నగరంలో మంగళవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఏకంగా ఐదు ప్రాంతాల్లో చోరీలు జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. వినాయక్ నగర్, సాయి నగర్, రుద్రంపేట బైపాస్తో పాటు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెండు ప్రాంతాల్లో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ఈ వరుస ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇద్దరు యువకులు బైక్పై తిరుగుతూ చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.