ఘనంగా సాగిన హజరత్ ఖాదర్ బాబా జన్మదిన వేడుకలు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్ట ఖాదర్ బాబా దర్గాలో సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి 130వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ మొహమ్ముద్ ఖ్వాజా మోహియుద్దీన్ బాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్గాలో చాదర్ సమర్పించి, విశ్వ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.