సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు సీతక్క దిశానిర్దేశం
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. మంచిర్యాల జిల్లా ఇన్చార్జిగా నియమితులైన బత్తుల వెంకటేష్, మాజీ చైర్మన్ కోట్నక్ తిరుపతి హైదరాబాదులో ఆమెను కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.