ముంబైలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్య
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
ముంబైలో దంపతుల మధ్య జరిగిన గొడవ ఘోరానికి దారితీసింది. 19 ఏళ్ల మహ్మద్ ఎహసాన్ షేక్, తన భార్య జన్నత్ ఎహసాన్ షేక్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. చికిత్స పొందుతూ నిందితుడు మరణించాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.