రాత్రిపూట స్మార్ట్ఫోన్ల వాడకంతో గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పని హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

రాత్రి సమయంలో ఎక్కువ కాంతికి గురికావడం వల్ల గుండె పనితీరు దెబ్బతింటుందని యూరోపియన్ హార్ట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైందని వైద్య నిపుణులు తెలిపారు. రాత్రుళ్లు మంచంపై పడుకుని స్మార్ట్ఫోన్లు వాడటం వల్ల వెలువడే కాంతి మెలటోనిన్ హార్మోన్ను అణచివేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల గుండె ప్రధాన పంపింగ్ చాంబర్ అసాధారణంగా మందమవడంతో పాటు గుండె సంకోచించే సామర్థ్యం తగ్గుతుందని, కాబట్టి రాత్రివేళల్లో స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.