ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్న ఎంపీ చింతకాయల విజయ్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లా ముందుకు సాగుతోందని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. నర్సీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మద్దతుతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందలేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.