తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల రద్దు మరో నాలుగు రోజులు పొడిగింపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తుల సౌకర్యార్థం ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల నిలిపివేతను ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి 25వ తేదీ దర్శన టోకెన్లను 24న తిరుపతిలో జారీ చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.