ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ పాస్పోర్ట్ జప్తుకు ఏసీబీ కోర్టు ఆదేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నలుగురు నిందితుల పాస్పోర్ట్లను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదిలీపై దర్యాప్తు కొనసాగుతుండటంతో, నిందితులు విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.