భూముల రీ సర్వేతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ హైమావతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సిద్దిపేట
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కె హైమావతి వెల్లడించారు. శనివారం చిన్నకోడూరు మండల పరిధిలోని రామునిపట్ల గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వేను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హద్దులు చెరిపేయడం వల్లే సమస్యలు వస్తున్నాయని, రైతుల ప్రయోజనాల కోసమే ప్రజా ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని తెలిపారు.