ఎన్నికల సంఘం నిర్ణయంపై నిప్పులు: సీఈసీ రాజీనామాకు నేతల డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా సవరణ వివాదంపై నిరసనలు తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తీహార్ జైలు నుంచి విడుదలైన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జారీ చేసిన సమన్లపై వారు మరింత సమయం కోరారు.