తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీవారి స్వర్ణరథోత్సవం
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.