ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన దిల్‌రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని టీజీఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సీఎంను వారు ఆహ్వానించారు. ఈ సమావేశంలో దర్శకుడు హరీశ్ శంకర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని సినీ రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.