బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శనివారం రాత్రి దర్శించుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి మండపానికి వచ్చిన ఆయన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం విజయ్ను శాలువాతో సత్కరించి బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. విజయ్ రాకతో ఉత్సవ ప్రాంగణం జనసంద్రంగా మారగా, అభిమానులు భారీగా తరలివచ్చి తమ ఆరాధ్య నటుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.