హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వేటు పడే అవకాశం ఉందా?

రిపోర్టర్: కిరణ్ స్థలం: హనుమకొండ

అసెంబ్లీలో కడియం శ్రీహరిపై గన్ షాట్ సైగలతో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. సభ మర్యాదలను ఉల్లంఘించినందుకు ఆయనపై అనర్హత వేటు పడితే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇది రాజకీయ కక్షసాధింపేనని బిఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదికపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.