విశాఖపట్నం జిల్లా కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినుల జడలు కత్తిరింపు
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా భీమిలి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం వసతిగృహంలో పడుకున్న పది మంది విద్యార్థినుల జడలను అగంతకులు కత్తిరించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న మధ్యాహ్నం 9వ తరగతి విద్యార్థినులు గదుల్లో నిద్రపోతున్న సమయంలో ఈ ఆకతాయి ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థినులే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ప్రిన్సిపల్ గంగాకుమారి దీనిపై విచారణ జరిపి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.