మహానంది ఆలయ హుండీలో తడిచి బూజుపట్టిన భక్తుల కానుకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నంద్యాల
ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తుల కానుకలు మట్టిపాలయ్యే పరిస్థితి దాపురించింది. ఆలయ హుండీలలోని కరెన్సీ నోట్లు నీరు చేరి పూర్తిగా తడిసిపోవడమే కాకుండా, బూజుపట్టి పాడైపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన వరుణయాగం సమయంలో హుండీలలోకి నీరు చేరినప్పటికీ అధికారులు సకాలంలో గుర్తించకపోవడంతో నోట్లు కుళ్ళిపోయాయి. భక్తుల సొమ్మును ఇలా నిర్లక్ష్యంగా పాడు చేయడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.