ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ త్వరలోనే పోతారంటూ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా సవరణ వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ త్వరలోనే పదవి నుంచి వెళ్లిపోతారని, ఆయన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యవస్థ కూడా కుప్పకూలుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను నిర్బంధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.