ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకల నిర్వహణకు పోలీసుల పిలుపు

రిపోర్టర్: Darla Venkateswarlu స్థలం: నాయుడుపేట

నాయుడుపేట డివిజన్లో వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక డీఎస్పీ చెంచుబాబు ప్రజలకు సూచించారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద రాత్రి సమయాల్లో రక్షణగా కాపలా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా డిజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.