బ్యాంక్ సిబ్బంది వేధింపులతో యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య
రిపోర్టర్: నరేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం శ్రద్ధావరం గ్రామానికి చెందిన సూలు వీర వెంకటరామ త్రిమూర్తి సత్యేంద్రసతీష్ కరప మండలం అరట్లకట్టలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న సతీష్, తన చావుకు బ్యాంక్ సిబ్బంది, స్థానిక డ్వాక్రా యానిమేటరే కారణమని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఆర్థిక లావాదేవీల్లో తప్పులను తనపై మోపారని ఆవేదన వ్యక్తం చేసిన సతీష్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.