బెంగళూరులో సెప్టెంబర్ 16 నుండి ఎలక్ట్రానికా ఇండియా 2026 ప్రదర్శన

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఎలక్ట్రానికా ఇండియా మరియు ప్రొడక్ట్రోనికా ఇండియా 2026 ప్రదర్శనలు జరగనున్నాయి. 30కి పైగా దేశాల నుంచి 750కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొనే ఈ మెగా ఎక్స్‌పోలో అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. గ్లోబల్ సప్లై చైన్ బలోపేతం మరియు సెమీకండక్టర్ రంగాల అభివృద్ధిపై ఇందులో చర్చిస్తారు.