గురుకుల పాఠశాలలో వాచ్విమెన్పై ఉపాధ్యాయుల దాడి కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: గంట్యాడ

గంట్యాడ మండలం నరవ బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికల సమాచారం బయటకు పొక్కిందన్న అనుమానంతో వాచ్విమెన్ కృష్ణవేణిపై ఉపాధ్యాయులు దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పాఠశాలలో ఎలాంటి దాడి జరగలేదని ప్రధానోపాధ్యాయిని తెలిపారు. కోరం లేకపోవడంతోనే ఎన్నికను వాయిదా వేశామని ఆమె స్పష్టం చేశారు.