'ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు': కొకాన్ కన్స్రా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హౌరా

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిధిలోని బేలూర్ బజార్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ పూజా పందిరి తీవ్ర వివాదాస్పదమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వినాయకుడు కలిసి టీ తాగుతున్నట్లుగా హిందూ రాష్ట్ర థీమ్‌తో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ విమర్శలపై నిర్వాహకుడు కొకాన్ కన్స్రా స్పందిస్తూ.. ఏ మతస్థుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని, ప్రధాని మోదీని దేశానికి ప్రతీకగా, వినాయకుడిని ధర్మానికి ప్రతీకగా భావించి ఈ థీమ్‌ను రూపొందించానని స్పష్టం చేశారు.