జనసేన సమన్వయకర్తగా కొట్టే సాయి నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా తనను నియమించినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు. బరిలో నిలిచే నాయకులు, కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని విజయానికి కృషి చేస్తానని కొట్టే సాయి గట్టిగా వివరించారు.