తుపాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష: బాధితులకు భరోసా

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం కోనసీమ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శించారని వెల్లడించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని చెప్పారు. ఆదివారం నాటికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారని వివరించారు.