నా చిన్ననాటి కష్టాలపై ఇక మాట్లాడబోనని బాలీవుడ్ నటుడు మనజ్ బాజ్పాయ్ స్పష్టం

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబయి

తన చిన్ననాటి కష్టాల గురించి పదే పదే మాట్లాడటంతో విసుగొచ్చిందని, ఆఖరికి తన బాల్యాన్ని తానే అసహ్యించుకుంటున్నానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సినిమాల ప్రమోషన్ల కోసం ఇకపై పాడ్కాస్ట్లలో పాల్గొననని తేల్చిచెప్పారు. తన ప్రయాణం స్ఫూర్తిదాయకం కాదని, అది నరకంతో సమానమని ఆయన పేర్కొన్నారు.