టెక్ దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్‌కు ఒక్కరోజే భారీ జాక్‌పాట్

రిపోర్టర్: శివ స్థలం: World

టెక్నాలజీ రంగంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి సంచలనం సృష్టించారు. కృత్రిమ మేధ రంగంలో చేపట్టిన వ్యూహాలు, మెటా షేర్లు దూసుకుపోతుండటంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఒక్కరోజే ఆయన నికర విలువ రికార్డు స్థాయిలో సుమారు 25 నుండి 27 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.2.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాల్ స్ట్రీట్‌లో మెటా షేర్లు 12 శాతం బలపడటంతో ఈ అద్భుత వృద్ధి సాధ్యమైంది.