అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం: బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలకు ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బాపట్ల

అక్రమ ఇసుక మరియు ఖనిజాల తవ్వకాలను అరికట్టడంలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని న్యాయ నిపుణులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం కవురివారిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్, న్యాయమూర్తి చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అసలు సూత్రధారులను వదిలేసి డ్రైవర్లు, క్లీనర్లపై కేసులు పెట్టడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.