ఆదివాసి హక్కులకై పోరాడిన గొప్ప యోధుడు కొమురం భీమ్

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

ఆదివాసి హక్కుల కోసం పోరాడిన కొమురం భీం నిజమైన ఉద్యమ యోధులని లక్షేట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ రావు అన్నారు. కొమురం భీం జయంతిని పురస్కరించుకొని గురువారం కళాశాల ఆవరణలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్యానికి, సాహసానికి మారుపేరు కొమరం భీమ్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.