తుఫాను ప్రభావంతో చీకటి పడేలోపే గణేష్ నిమజ్జనాలు పూర్తి చేయాలి

రిపోర్టర్: రమేష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావం దృష్ట్యా రానున్న రెండు రోజుల పాటు గణేష్ నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడేలోపు పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సూచనలు పాటిస్తూ ప్రజల భద్రతను కాపాడేందుకు అందరూ పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.