తిమ్మాపురంలో గాంధీ జయంతి వేడుకలు: గ్రామసభలో పలు అభివృద్ధి పనులపై చర్చ

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ కొస్న లక్ష్మికిష్టయ్య యాదవ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై గ్రామస్తులు, అధికారులతో కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపారు.