జగిత్యాల నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవ బందోబస్తులో 17 మంది ట్రాన్స్‌జెండర్లు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో భాగస్వాములయ్యారు. సమాజ సేవకు లింగభేదం లేదని నిరూపిస్తూ వారు అందించిన సేవలను స్థానిక యంత్రాంగం, ప్రజలు అభినందించారు. సమానత్వం, గౌరవం, భాగస్వామ్యంతోనే సమగ్ర సమాజం ఏర్పడుతుందని ఎస్పీ జగిత్యాల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ సేవా స్ఫూర్తి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.