భగత్ సింగ్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల మండలం పంతంగిలోని అక్షర ట్యూషన్ కేంద్రంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బర్మా నాగరాణి, కో ఆర్డినేటర్ చినుకని యువరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.