అమెరికాలో సంచలనం: ట్రంప్ ఆమోద రేటింగ్ పతనంపై రాయ్‌టర్స్ పోల్ స్పష్టత
రిపోర్టర్: రమేష్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోద రేటింగ్ భారీగా పడిపోయినట్లు రాయిటర్స్ ఇప్సోస్ పోల్ వెల్లడించింది. మధ్యంతర ఎన్నికల వేళ ఆయన ఆమోద రేటింగ్ ముప్ పై రెండు శాతానికి పడిపోయిందని సర్వే తేల్చింది. రిపబ్లికన్ల పాలనకు వ్యతిరేకంగా డెమొక్రాట్లు ముందంజలో ఉన్నారని, జీవన వ్యయం పెరగడం ప్రధాన ఎన్నికల అంశంగా మారిందని సర్వే పేర్కొంది. ప్రస్తుత పరిణామాలు అధికార పార్టీకి తీవ్ర సవాల్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.