పుత్తూరులో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పుత్తూరు
తిరుపతి జిల్లా పుత్తూరు పున్నమి సర్కిల్‌లో ఎస్ఐ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.