గిరిజన గోండు మహిళగా రష్మిక మైసా టీజర్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైసా టీజర్ తాజాగా విడుదలైంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక గిరిజన గోండు మహిళగా సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అడవులు, గిరిజన ప్రాంతాల నేపథ్యంలో తన తండ్రి, ప్రజల కోసం పోరాడే యోధురాలిగా ఆమె పాత్ర సాగనుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.