ఏపీలో హైవే విస్తరణ: రూ.3,476 కోట్లతో వినుకొండ-గుంటూరు మార్గం 4 లేన్లుగా అభివృద్ధి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్లో రహదారి కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కీలక అడుగులు వేశారు. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిలో భాగంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు 85.9 కిలోమీటర్ల మేర హైవేను 4 వరుసలుగా విస్తరించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని అధికారులు తెలిపారు. రూ.3,476 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డీపీఆర్ను పీపీపీఏసీ ఆమోదం కోసం పంపినట్లు వెల్లడించారు.