ములుగు బార్ లక్కీ డ్రాలో టీస్టాల్ నిర్వాహకుడిని వరించిన అదృష్టం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ములుగు

ములుగు బార్ లక్కీ డ్రాలో హనుమకొండ బస్టాండ్ టీ స్టాల్ నిర్వాహకుడు వెంకటేశ్ అదృష్టవంతుడిగా నిలిచారు. కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన లాటరీలో ఆయనకు 349వ నంబర్పై బార్ లైసెన్స్ దక్కింది. కేవలం ఒక్క దరఖాస్తు చేసిన ఆయనను అదృష్టం వరించింది. మొత్తం 376 దరఖాస్తులు రావడంతో నెలకొన్న ఉత్కంఠకు దీనితో తెరపడింది.