విజయనగరం వైద్యారోగ్యశాఖలో కలకలం: సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న సుమారు నాలుగు వందల యాభై మంది ఒప్పంద ఉద్యోగులు సమ్మెకు దిగినట్లు ఉద్యోగుల సంఘం కోఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జీజీహెచ్ వద్ద మంగళవారం నిరసన శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమ్మె కారణంగా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యసేవలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.