తాటిపాక గ్రామంలో ఫైనాన్స్ కంపెనీ యజమానులతో కోనసీమ పోలీసుల కీలక సమావేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: కోనసీమ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో తాటిపాక గ్రామంలో ఫైనాన్స్ కంపెనీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు కోనసీమ పోలీసులు వెల్లడించారు. ఈ సమావేశంలో రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పాల్గొని ఫైనాన్స్ సంస్థల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు.