ఎమ్మిగనూరులో రూ.303 లక్షల అభివృద్ధి పనులకు భూమి పూజ
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.303.38 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీలు మరియు కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించారు.
పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే, పట్టణ ప్రజలకు 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.