ముఖ్యమంత్రి అరెస్టుకు మూడేళ్లు నిండిన సందర్భంగా కలిగిరిలో 53 దీపాలు వెలిగించనున్న టీడీపీ శ్రేణులు

రిపోర్టర్: నాగరాజు కె స్థలం: కలిగిరి

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ముఖ్యమంత్రి అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిజం గెలిచింది పేరుతో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనల మేరకు మండల హెడ్ క్వార్టర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద 53 దీపాలు, అలాగే బొమ్మరాజుచెరువు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక దీపోత్సవం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు పూసాల వెంగపనాయుడు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, క్లస్టర్, బూత్ ఇన్ఛార్జులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.