నర్సీపట్నం మున్సిపల్ గెలుపుతో చెర్లోపాలెంలో హోరెత్తిన కూటమి శ్రేణులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి లెక్కల సన్యాసినాయుడు ఆధ్వర్యంలో విజయ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి, చైర్మన్గా పద్మావతి ఎన్నిక కావడంతో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని ఘనంగా పంచుకున్నారు.