రక్షా ఎక్స్పో కర్టెన్ రైజర్ ఆవిష్కరణ: రేవంత్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
రిపోర్టర్: విజయ్
స్థలం: సూర్యాపేట
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రక్షా ఎక్స్పో కర్టెన్ రైజర్ ను ప్రారంభించి లోగోను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ అగ్రగామిగా మారుతోందని, బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ కంపెనీలతో బలమైన పారిశ్రామిక వాతావరణం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.