కాన్పూర్‌లో సంచలనం: వ్యాపారి హత్య కేసులో కోడలి పాత్రపై విచారణ
రిపోర్టర్: రాము
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫార్మా వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడు సుబ్రత్ మనోచా పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుబ్రత్ భార్య షాలు మనోచాను ప్రధాన నిందితురాలిగా గుర్తించి, సుపారీ కిల్లర్లతో ఆమె సంబంధాలపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్య వెనుక భర్తకు ముందే తెలుసా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.