సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతంటూ నటుడు మమ్ముట్టి వ్యాఖ్యలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Kerala

తోటి మానవులకు సాయం చేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి స్పష్టం చేశారు. పరుమల చర్చి ఉత్సవాల ముగింపు వేడుకల్ లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేవుడు ఆటోరిక్షాలో వచ్చి ఎవరికీ సహాయం అందించడని, మనుషుల రూపంలోనే దయను చాటుతాడని మమ్ముట్టి పేర్కొన్నారు. భక్తి భావంతో ఇచే ప్రతీ రూపాయి పేదల సంక్షేమానికే ఉపయోగపడాలని ఆయన స్పష్టం చేశారు.